విద్యుత్ షాక్ తో రైతు మృతి
15-06-2026 11:49 AM
కొల్చారం (విజయ క్రాంతి): వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాలు. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన కురుమ పోచయ్య అనే రైతు సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలం కు వెళ్లారు. వరి తుకం పరిశీలిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.






