15 June, 2026 | 1:06 PM

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం

15-06-2026 12:10 PM

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో(Schools) చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం, పాఠశాలకు హాజరును పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని లోక్ భవన్ పాఠశాలలో(Lok Bhavan School) మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులకు మంత్రి టిఫిన్ తినిపించారు. తరగతులు ప్రారంభించే ముందు విద్యార్థులకు పౌష్టికరమైన బ్రేక్‌ఫాస్ట్ అందించడం, తద్వారా వారి ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది.

''వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది.  విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.'' అని మంత్రి పొన్నం ఎక్స్ లో పోస్టు చేశారు.  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , యశస్వినీ రెడ్డి , కలెక్టర్ ప్రియాంక ఆలా ,డీఈవో యాదయ్య , మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.