30 July, 2026 | 8:42 PM

బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి

30-07-2026 07:43 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.బొల్లారం గ్రామంలోని ఓఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17,240 నగదు,ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలో పేకాట,మద్యం అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై భార్గవ్ గౌడ్ హెచ్చరించారు.