పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు
30-07-2026 07:45 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి పీర్జాదిగూడలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం ఆగస్టు 9న అత్యంత వైభవంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమై బోనాల ఉత్సవాల నిర్వహణపై చర్చించి తేదీని ఖరారు చేశారు. కావున, పీర్జాదిగూడ 10వ డివిజన్ ప్రజలందరూ కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలు పొంది సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.






