బీజేపీ కార్మిక విభాగం కన్వీనర్ గా కరణం గణేష్ రవికుమార్ నియామకం
చేగుంట,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా కార్మిక విభాగం కన్వీనర్ గా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన కర్ణం గణేష్ రవికుమార్ ను నియమించినట్టు బీజేపీ రాష్ట్ర కార్మిక విభాగం కన్వీనర్ అందే శ్రీనివాస్ తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందె శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ రవి కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేసి జిల్లాలో కార్మిక సమస్యలపై పోరాడి కార్మికులకు న్యాయం చేస్తాను.
కార్మిక విభాగంను ప్రతి మండల కేంద్రాలలో పటిష్టం చేసి ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు. ఈ నియామకానికి సహకరించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు , జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు చింతల భూపాల్, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు ర్యాపాకుల చంద్రశేఖర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.






