30 July, 2026 | 9:07 PM

Breaking News

ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు

30-07-2026 07:56 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉండాలంటే ఓటర్ తీసుకునే నిర్ణయమే కీలకమని అందుకు బీఎల్ఏ 2లు ఓటరు నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమ నిర్వహణపై ఆయన మాట్లాడారు. బిఎల్ఏలు కొత్త ఓటర్ నమోదు తప్పుల సవరణ ఓటర్ వివరాల ధ్రువీకరణ క్షేత్రస్థాయిలో బిఎల్ఎ సమన్వయంగా పనిచేసే అంశాలపై వాళ్లు సూచనలు చేశారు.

ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉండాలంటే ఓటరు ముఖ్యమనేది గుర్తించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందని ఒక్క అర్హుడైన ఓటర్ కూడా జాబితాలో తప్పిపోవద్దన్నారు. అనుమానితులైన ఓటర్లు ఉంటే వారిని గుర్తించాలన్నారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ కీలకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించి ఓటర్కు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.

ప్రత్యేక పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చురుకుగ పనిచేసిప్రతి అర్హుడైన ఓటర్ను గుర్తించాలన్నారు. అర్హత ఉంటే జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుడైన ఓటర్కు అందకుండా పోతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై బిఎల్ఓ లకు దిశా నిర్దేశం చేశారు.

కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న, సోనాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల పోతన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ,ఇన్చార్జి భూ పెళ్లిశ్రీధర్ , నియోజకవర్గ కోఆర్డినేటర్ ప సుల చంటి, మాజీ అధ్యక్షులు ప్ర పూల్ రెడ్డి,, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఆశన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లోలపు పోశెట్టి,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ్రావు పాటిల్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు దౌలత్ రావు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ అంజయ్య, మాజీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి సద్దాం మాజీ ఎంపీటీసీ చెట్ల ఉమేష్ సూపర్వైజర్లు ఉన్నారు.