కౌటాల కాంగ్రెస్‌లో కలకలం
- కార్యకర్తల న్యాయంపై పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్
- కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు? అంటూ ప్రశ్నలు
కౌటాల,ఆగస్టు28(విజయక్రాంతి)మండల కాంగ్రెస్లో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలంటూ రూపొందించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రాధాన్యం, అవ కాశాలు కల్పించాలంటూ పోస్టర్లో ప్రశ్నలు లేవనెత్తడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
కష్టకాలంలో జెండా మోసినోళ్లకు.. అధికారంలోకి రాగానే మరిచారాఅంటూ పోస్టర్లో చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల అంశా న్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన పాత కార్యకర్తలకు పదవులు, పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ సంబంధిత అవకాశాల్లో తగిన ప్రాధాన్యం దక్కు తోందా? లేదా? అంటూ పోస్టర్ ప్రశ్నిస్తోంది.
ఎన్నికలప్పుడు కార్యకర్తలు.. ఇప్పుడు ఎందుకు పక్కన?
ఎన్నికల సమయంలో పార్టీ కోసం ముందుండి పనిచేసిన కార్యకర్తలకు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉండాలనే డిమాండ్ ఈ పోస్టర్ ద్వారా వ్యక్తమవుతోంది. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తల కు ముందుగా అవకాశాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జోరుగా చర్చ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో కౌటాల కాంగ్రె స్లో నిజంగా పాత కార్యకర్తలకు న్యాయం జరుగుతోందా?,
పార్టీ కోసం కష్టపడిన వా రికి గుర్తింపు ఎప్పుడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కార్యకర్తల అసంతృ ప్తి నిజమైతే పార్టీ నాయకత్వం దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.జెండా మోసిన కార్యకర్తల ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.






