29 August, 2026 | 2:36 AM

నాయకులకు రాఖీలు కట్టిన పావని వినయ్ కుమార్

29-08-2026 01:21 AM

ముషీరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అన్నా-చెల్లెళ్ల అనుబంధం ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీక అని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా డివిజన్లోని సోదర సమానులైన సీనియర్ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం దేశానికి, ధర్మానికి రక్ష అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, సీనియర్ నాయకులు మొహమ్మద్ మహమూద్, రత్న సాయి చంద్, ఎం. ఉమేష్, రవిమన్యు, యాదగిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.