వృక్షాలకు రాఖీలు కట్టిన అధికారులు
నిర్మల్ ఆగస్టు 28 ( విజయక్రాంతి)‘ప్రకృతి మిత్ర‘ NGO, నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో గండి రామన్న అర్బన్ పార్క్, చించోలి నందు వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఎకో-ఫ్రెండ్లీ రాఖీలను కదంబ వృక్షాలు మరియు రాఖీ తీగలతో స్వయంగా తయారు చేసి, ప్రకృతి ప్రేమికులు, పార్క్ సందర్శకులతో చెట్లకు రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా చెట్లను సోదర సోదరీ బంధానికి ప్రతీకగా భావిస్తూ, వాటి సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎం.డి. నజీర్ ఖాన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సారంగాపూర్, ప్రకృతి మిత్ర సంఘం సభ్యులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ మధు, రమణారెడ్డి, సిద్ధూ, స్వదేశ్ పరికిపండ్ల, అశోక్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






