28 August, 2026 | 11:55 PM

సీఎంకు రాఖీ కట్టిన రామాయంపేట మహిళ

28-08-2026 11:03 PM

రామాయంపేట: రాఖీ పండుగ వేళ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు మరో మధుర జ్ఞాపకం చోటుచేసుకుంది. రామాయంపేట పట్టణానికి చెందిన జొన్నల శ్వేత పవన్ శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆత్మీయంగా కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శ్వేత పవన్‌కు ప్రత్యేక ఆశీస్సులు అందించి, రాఖీ కట్టినందుకు ఆత్మీయంగా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ హోదాలకు అతీతంగా సాగిన ఈ రాఖీ బంధం.. రామాయంపేట మహిళకు చిరస్మరణీయ అనుభూతిగా నిలిచింది.