15 May, 2026 | 3:27 AM

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట

15-05-2026 02:10 AM

కోదాడ మే 14: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ అన్నారు. గురువారం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట నిర్వహించి అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

పాఠశాలలోని మౌలిక సదుపాయాలు కంప్యూటర్ విద్య, డిజిటల్ విద్యాబోధన, చదువుతోపాటు సంస్కారం పై దృష్టి పెట్టి, విలువలతో కూడిన విద్య బోధనతో అర్హత అనుభవం అంకితభావం గల ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థుల భవిష్యత్తు సర్వతోముఖాభివృద్ధి , వికాసం కోసం వివిధ రకాల కోకరికులం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, సాధించిన ఫలితాలు,  మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు . కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.