15 May, 2026 | 3:29 AM

బడి ఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించమే లక్ష్యం

15-05-2026 02:10 AM

అలంపూర్, మే 14: బడి ఈడు కలిగిన ప్రతి విద్యార్థిని గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యమే బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యమని ఎంఈఓ శివప్రసాద్ అన్నారు. మేరకు బుధవారం మానవపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంఈఓ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు