15 May, 2026 | 3:29 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరేలా కృషి

15-05-2026 02:09 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం

చిట్యాల, మే 14 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు  చేరేలా కృషి చేస్తున్నాం అని ప్రభుత్వ విప్, నకిరేకల్  శాసనసభ్యుడు వేముల వీరేశం పేర్కొన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.

ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116 ఆర్థిక సాయం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు  చేరేలా కృషి చేస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండకూడదని, పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఈ పథకం తీసుకొచ్చామని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బు జమ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.