శశికళ కొత్త పార్టీ
పార్టీ జెండా ఆవిష్కరణ.. త్వరలో పేరు ప్రకటన
చెన్నై, ఫిబ్రవరి ౨౪: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, జయలలిత నెచ్చెలి వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా రామనాథపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలుకానున్నదని, తమ పార్టీ పేరు త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఆశయాల బాటలో నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ సభలోనే ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఉంది. జెండా మధ్యలో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలు ఉండటం విశేషం. పార్టీ పేరు కూడా ‘అన్నాడీఎంకే’కి దగ్గరగా ఉంటుందని సమాచారం.




