ఫార్మసీ స్టోర్ ప్రారంభించిన సర్పంచ్ వినోద్
04-08-2026 02:09 AM
ములకలపల్లి ఆగస్టు 3 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో ప్రముఖ గ్రామీణ వైద్యులు సుభాని కుమారుడు అనీద్ ఏర్పాటు చేసిన అంజునా ఫార్మసీ స్టోర్ ను జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారం వృద్ధి చెందాలని ప్రజలకు నాణ్యమైన మందులు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జగన్నాధపురం గ్రామ ప్రజలు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.






