29 June, 2026 | 1:06 AM

చిన్నారుల ఆరోగ్యానికి భరోసా.. పల్స్ పోలియో

29-06-2026 12:00 AM

మున్సిపల్  చైర్పర్సన్ సామినేని సుజాత

మధిర, జూన్28 (విజయ క్రాంతి): రేపటి సమాజ నిర్మాతలు నేటి బాలలే,అటువంటి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు భరోసా రెండు పల్స్ పోలియో చుక్కలని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత అన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు తప్పనిసరిగా కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలి అన్నారు.పల్స్ పోలియో కార్యక్రమం కేవలం ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదు,ఇది ఒక సామాజిక కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రామనాథం, సూర్యదేవర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.