13 May, 2026 | 1:51 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

శతక్కొట్టిన సర్ఫరాజ్

23-01-2026 12:22 AM

హైదరాబాద్, జనవరి 22 : దేశవాళీ క్రికెట్‌లో ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా అత్యంత నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

హైదరాబాద్ బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ ముంబైకి భారీస్కోరు అందించాడు. సిద్దేశ్ లాడ్ కూడా శతకం సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ముంబై 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (104) ఔటవగా.. సర్ఫరాజ్ ఖాన్ 142 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ సర్ఫరాజ్ రాణించాడు.