13 May, 2026 | 12:59 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

రికెల్టన్, స్టబ్స్‌కు పిలుపు

23-01-2026 12:24 AM

డర్బన్, జనవరి 22 : టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు గాయాలు వెంటాడుతుండడంతో దక్షిణాఫ్రికా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయాలతో ఫెరీరా, డి జోర్జి మెగాటోర్నీకి దూరమ య్యారు. దీంతో వీరిద్దరి స్థానాల్లో ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ ను ఎంపిక చేశారు. డి జోర్జి భారత పర్యటనలో గాయపడ గా... ఫెరీరా సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతూ గాయపడ్డాడు. వీరిద్దరూ విండీస్‌తో సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌కు దూరమయ్యారు.

ముం దు జట్టు ఎంపికలో వీరిద్దరినీ తీసుకోకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు గాయాలతో దూరమైన ఆటగాళ్ల జాబితాలో వీరిని తీసుకోవడానికి వారి ఫామే కారణం. ఎస్‌ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రికెల్టన్ గత వారం కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 42కు పైగా సగటుతో 337 రన్స్ చేశాడు. అటు స్టబ్స్ గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినప్పటకీ భారత్ పిచ్‌లపై ఐపీఎల్‌లో ఆడిన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు.