టీఆర్ఎస్ జండా గద్దెను పరిశీలించిన సలేంద్ర కొమురయ్య యాదవ్
06-06-2026 07:26 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ బస్ స్టాప్ వద్ద తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యులు సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్మాణం అవుతున్న జెండా గద్దెను తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యులు సలేంద్ర కొమురయ్య యాదవ్ పరిశీలించారు. జెండా గద్దెల నిర్మాణంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలు, గ్రామాలలో ఈ జెండా పండుగ సందర్భంగా జెండా గద్దెలను నిర్మిస్తామని సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు.






