6 June, 2026 | 8:46 PM

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఆర్డీవో

06-06-2026 07:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల శనివారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షర్మిల జిల్లా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. కాగా, షర్మిల శనివారం కరీంనగర్ ఆర్డీవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.