28 July, 2026 | 1:22 AM

రాష్ట్రస్థాయి కిడ్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన సాయి చెల్సియా రాథోడ్

28-07-2026 12:34 AM

గాంధారి, జూలై 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాకు చెందిన సాయి చెల్సియా రాథోడ్ రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు తండ్రి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 10 కేటగిరీలో 60 మీటర్ల పరుగు పందెంలో పోటీ పడిన సాయి చెల్సియా బంగారు పతకం సాధించింది.

రాష్ట్ర స్థాయి పోటీలు వచ్చే నెల 7, 8వ తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో ఆమె కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది.. ప్రస్తుతం సాయి చెల్సియా రాథోడ్ తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. పోటీలో గెలుపొందిన ఆమెకు కామారెడ్డి సి.ఐ. శ్రీధర్ గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ శ్రీనివాస్ బహుమతి ప్రధానం చేశారు.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన సాయి చెల్సియా ను మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు..