28 July, 2026 | 1:32 AM

సాయి ప్రాపర్టీస్ గిన్నిస్ రికార్డు

28-07-2026 12:37 AM

గంటలో 60, 352 ఎర్రచందనం మొక్కలు నాటి ఘనత

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పర్యావరణ పరిరక్షణలో అరుదైన ఘనత సాధించింది. ఏపీలోని ఒడూరులో ఈ నెల26న సంస్థ వ్యవస్థాపకుడు చామకూరి శ్రీనివాసరావు నాయకత్వంలో కేవలం ఒక గంటలో 60,352 ఎర్రచందనం మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

గతంలో ఒక గంటలో 30 వేల మొక్కలు నాటిన ప్రపంచ రికార్డును భారీ తేడాతో అధిగమించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (సేల్స్) కె.ఎస్.వి. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ రికార్డు పర్యా వరణ పరిరక్షణ, హరిత భారత నిర్మాణం, ఎర్రచందనం సాగు ప్రోత్సాహానికి తమ సంస్థ చేస్తున్న కృషికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపని తెలిపారు.