28 July, 2026 | 2:06 AM

ప్రతిభ కనబరిచిన నిమ్స్ ఫిజియోథెరపీ విద్యార్థులు

28-07-2026 01:20 AM

పంజాగుట్ట, జూలై 27 (విజయక్రాంతి): మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఇటీవల ఇంటర్ సిటీ ఫిజియోథెరపీ మెగా స్పోరట్స్ అండ్ క్విజ్ ఫెస్టివల్ 2026 జరిగింది. ఈ పోటీల్లో నిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థులు విశేష ప్రతిభను కనబరించారు. అకాడమిక్ క్విజ్, మెన్స్ చెస్, ఉమెన్స్ లాంగ్ జంప్, మెన్స్ లాంగ్ జంప్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. వుమెన్స్ చెస్, కబడ్డీ, మెన్స్ అండ్ వుమెన్స్ టేబుల్ టెన్నిస్, వుమెన్స్ షాట్ పుట్ విభాగాల్లో రన్నరప్ గా నిలిచి ప్రతిభను చాటారు.

ఈ విషయమై నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ సోమవారం మాట్లాడుతూ విద్యార్థుల కృషిని అభినందించారు. వారి క్రమశిక్షణ, టీం స్పిరిట్, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించిన నిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సునీత్ వాఘ్రే, కళాశాల సిబ్బందిని అభినందించారు.