18-02-2026 01:39:08 AM
టీఆర్పీ నాయకుల డిమాండ్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు ఫ్లుఓవర్‌కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఎల్‌బి నగర్ జోనల్ కమిషనర్‌కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలు చేసిన మహనీయుడని తెలిపారు. ఎల్బీనగర్ ప్రాంత ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ సాగర్ రింగ్ రోడ్ ఫ్లుఓవర్‌కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు అధికారికంగా నామకరణం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ యాదవ్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు సంపత్ పాల్గొన్నారు.