13 June, 2026 | 8:55 PM

108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం..

13-06-2026 07:39 PM

తండా నుంచి  రెండు కిలోమీటర్లు ఎడ్ల బండి పై ప్రయాణం..

కన్నాపూర్ నుండి అంబులెన్స్ లో ప్రయాణం..

ఉట్నూర్,(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ పంచాయతీ పరిధిలోని కన్నాపూర్ తాండ్రకు చెందిన శనివారం ఉదయం మూడో కాల్పుకు  పుట్టి నొప్పులతో బాధపడుతుంది.. సిరికొండలోని 108 అంబులెన్స్ కు మొబైల్ ద్వారా సమాచారం అందించి తండా నుండి  కన్నాపూర్ వరకు ఎడ్ల బండిలో  తీసుకువచ్చారు. ఆలోపు 108 అంబులెన్స్  కన్నాపూర్ కు రాగానే అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు  ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ లో  మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108  ఈఎంటి  పోలే గణేష్, పైలెట్ ఆత్రం అశోక్  లు సుఖ ప్రసవం చేశారు.

ఈ సందర్భంగా బాలింత భర్త సురేష్ మాట్లాడుతూ.. తమ గ్రామానికి సరియైన రోడ్డు లేదని, మధ్యలో వాగు ఉందని తమ తండాకు 108 అంబులెన్స్ రాదన్నారు. అంబులెన్స్ వారికి  మొబైల్ ద్వారా సమాచారం అందించి ఎడ్ల బండిపై రెండు కిలోమీటర్ల దూరం  తన భార్య పుట్టినప్పులతో బాధపడుతుండగా తీసుకోవచ్చానని ఆయన తెలిపారు. వర్షాకాలంలో గర్భిణులను  ప్రసూతి కోసం  తీసుకురావాలంటే ప్రాణాలను అరిచేతులో పెట్టుకోవలసిన  పరిస్థితి ఉందన్నారు. తమ తాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని  కోరుతున్న పట్టించుకునే నాథుడు లేరని  సురేష్ ఆవేదనతో తెలిపారు.