13 June, 2026 | 9:48 PM

Breaking News

కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల నోటీసులు   •   నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం   •   ‘మన ఊరు–మన అంగన్వాడి’ నినాదంతో బడిబాట కార్యక్రమం   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •  

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

13-06-2026 08:10 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో దండు మరియమ్మకు రూ.25,000 సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కును మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్  సింగిరెడ్డి పద్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, పద్మారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్య భద్రతను, ఆర్థిక భరోసాను    కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో  ఉపయోగపడుతుందని, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరంల మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ఉపయోగించుకోవాలని  సూచించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందుకున్న దండు మరియమ్మ కుటుంబ సభ్యులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, సింగిరెడ్డి పద్మా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నత్తి మైసయ్య, పడుతం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.