13 June, 2026 | 9:03 PM

ప్రభుత్వనికి సర్పంచ్ ల హెచ్చరిక

13-06-2026 07:42 PM

మండల సర్పంచుల పోరం అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ 

జగదేవపూర్: జగదేవపూర్ మండలం కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మండల సర్పంచుల పోరం అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో మండల సర్పంచులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచుల పోరం అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... సర్పంచులు గ్రామ పంచాయతీలకు వచ్చి 6 నెలలు అయిన గ్రామ పంచాయతీ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిజింగ్ పెట్టి గ్రామ పంచాయతీ సర్పంచులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే నిధులు విడుదల చేయాలన్నారు.

సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తే గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్న డిజిటల్ బిలులు ఇవ్వలేక పోతున్నామని అన్నారు.నిధులు లేక  గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయని వాపోయారు. త్వరగా నిధులు విడుదల చేయకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆలేటి కవిత లోలాకర్ రెడ్డి,రాచమల్ల ఎల్లేష్, కుడుదుల రజిత  పరుశురాం,జుర్రు స్రవంతి వెంకటేష్, చెక్కల పరమేశ్వర్,బత్తిని రాజు,క్యాసారం కుమార్ తదితరులు పాల్గొన్నారు.