13 June, 2026 | 9:42 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •  

ఇంగ్లీష్ వృత్తి నైపుణ్యతపై ఉపాధ్యాయులకు శిక్షణ

13-06-2026 08:17 PM

నేలకొండపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు చెరుకూరి రమేష్ మాట్లాడుతూ 21వ శతాబ్దపు బోధనా నైపుణ్యాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, ఆధునిక బోధనా పద్ధతులు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విలువల ఆధారిత విద్యపై అవగాహన కల్పించారు. తర్వాత మాన్విత స్కిల్స్ అకాడమీ నుండి ఫౌండర్ మాన్విత వయసు 8 సం.లు ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సంభాషించి ఇంగ్లీష్ భాషానైపుణ్యాల గురించి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ మరియాకుమార్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.