గిరిజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శిగా లింగానాయక్
13-06-2026 08:25 PM
మిర్యాలగూడ,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సమాఖ్య నల్గొండ జిల్లా కార్యదర్శిగా దీరావత్ లింగా నాయక్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థి యువజన గిరిజన సమస్యల పరిష్కారంలో లింగా నాయక్ సేవలను గుర్తించి రెండోసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సమైక్య ఇన్చార్జి పల్లా నరసింహారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి హక్కుల సాధనకై నిరంతరం ఉద్యమిస్తానన్నారు.






