ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు విడుదల చేయాలి
ఆగస్టు 3న ఇందిరా పార్క్ వద్ద సాధన దీక్ష
వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా
ముషీరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆర్యవైశ్య కార్పొరేషన్కు తక్షణమే రూ.500 కోట్లు నిధులు విడుదల చేసి,15 మంది సభ్యులతో డైరెక్టర్ల బోర్డును నియమించాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆగస్టు 3న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న సాధన దీక్ష పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైశ్యుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముక్క సాంబశివరాజు, నంగునూరు రమేష్, కొత్త రవికుమార్ గుప్త, కాసం ఏకసాయి, గజవాడ సత్యనారాయణ, బుక్క మనోహర్, మురళి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






