1 June, 2026 | 3:06 AM

పరాగ్ ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్

01-06-2026 02:17 AM

ముంబై, మే 31 : శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చే సుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరా గ్ గాయం కారణంగా లంక టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్దానంలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశారు. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దా దాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

ఐపీఎల్- 2026సీజన్‌లో రుతురాజ్ 14 మ్యాచ్‌లలో 337 పరుగులు చేశాడు. రుతురాజ్ తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన పరాగ్ దాని తీవ్రత ఎక్కువగా ఉండ డంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.