1 June, 2026 | 4:16 AM

ఏపీ అథ్లెట్ వెంకట్రామిరెడ్డికి స్వర్ణం

01-06-2026 02:16 AM
  1. ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్స్
  2. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు క్వాలిఫై

హాంకాంగ్, మే 31 : గత కొంతకాలంగా మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో సంచలనాలు సృష్టించిన ఏపీ అథ్లెట్ మొగిలి వెంకట్రామిరెడ్డి మరోసారి మెరిసాడు. 22వ ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 800 మీటర్ల రేసును 1 నిమిషం 48.20 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో అమెరికాలో జరగనున్న ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.

వెంకట్రామిరెడ్డి విజయంపై ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ కీర్తిని చాటినందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టాలెంట్ ఉన్న అథ్లెట్లను గుర్తిస్తూ ప్రోత్సహిస్తున్నామనీ ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎం నారాయణరావు చెప్పారు. వెంకట్రామిరెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు గెలవాలని ఆకాంక్షించారు.