27 April, 2026 | 2:15 AM

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

27-04-2026 12:33 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు లో హయత్ నగర్ డిపో2 చెందిన ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ పై తాగిన మైకంలో యువకులు వీరంగం చేశారు. వివరాల్లోకి వెళ్తే... హయత్ నగర్ డిపో2 చెందిన డ్రైవర్ వినోద్ కుమార్, కండక్టర్ సాయి ఆదివారం సాయంత్రం అఫ్జల్ గంజ్ నుంచి కుంట్లూర్ వరకు (టీజీ 10టీ 5928) వస్తున్నారు.

ఈ క్రమంలో బస్సు కుంట్లూర్ కు చేరుకుంటుం డగా ఆదే సమయంలో బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు తమకు దారి ఇవ్వలేదని డ్రైవర్, కండక్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డ్రైవర్, కండక్టర్ కు తీవ్ర గాయాల య్యాయి. దాడి ఘటనపై హయత్ నగర్ డిపో డీఎం శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.