28 July, 2026 | 1:47 AM

60 గజాల బాధితులకు ఆర్‌ఎస్‌పీ సంఘీభావం

28-07-2026 12:00 AM

పేదలకు కేటాయించిన స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

మొయినాబాద్ జూలై 27(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాల కో సం కొనసాగుతున్న బాధితుల రిలే దీక్షలకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సోమవారం సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడిన ఆయన వారి సమ స్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, 2007లో నిరుపేదలకు పంపిణీ చేసిన 60 గజాల ఇళ్ల స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.

పేదలకు కేటాయించిన భూ మిలో గుడిమల్కాపూర్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం సమంజసం కాదని, పేదలు తమ హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు స్థలాలు చూపించి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. హిమాయత్నగర్ ప్రజలకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచి వారి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పల్లగోల్ల మలేష్ యాదవ్, యువజన సంఘాల ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, 60 గజాల బాధితులు తదితరులు పాల్గొన్నారు.