28 July, 2026 | 2:38 AM

ఉదారత చాటుకున్న గురువు

28-07-2026 12:00 AM

బోయినపల్లి: జూలై 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యా బోధన చేసే ఉపాధ్యాయు డు గుండేటి చంద్రమౌళి (స్కూల్ అసిస్టెంట్) పక్క గ్రామం గుండన్నపల్లి నుండి రోజు స్కూల్ కు 2 కిలోమీటర్లు నడిచి వస్తున్న విద్యార్థిని గుంట అనుశ్రీకి సొంత డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసి అందించారు. 

ఈ సందర్భంగా స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ విద్యను బోధించే గురువులు విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పడంతో పాటు వారి స్థితి గతుల గురించి, బాగోగుల గురించి ఆలోచించడం శుభ పరిణామం అన్నారు. అలాగే పాఠశాలకు సంబంధించి ఏ అవసరం ఉన్న తాను, పాలకవర్గం అందుబాటులో ఉంటుందని తెలిపారు, పాఠశాల విద్యార్థుల తరపున గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రగిరి వెంకటేష్, గంగాధర గంగాజమున, చిలుముల శ్రీమణి, కొట్టేపల్లి రమ్యశ్రీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.