రాజస్థాన్‌కు షాక్
ఢిల్లీ సంచలన విజయం
పోరెల్, రాహుల్ విధ్వంసం
ప్లే ఆఫ్ రేసులో క్యాపిటల్స్
స్టార్క్ సూపర్ స్పెల్
ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా రసవత్తరంగా మారింది. మూడు బెర్తులు మిగిలి ఉన్న వేళ పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్లు వరుసగా అదరగొడుతున్నాయి. పైన ఉన్న జట్లకు చుక్కలు చూపి స్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. హై స్కోరిం గ్ మ్యాచ్‌లో ఊహించని విధంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విజ యంతో ఢిల్లీ కూడా ప్లే ఆఫ్ రేసులో నిలవగా, రాజస్థాన్ మాత్రం వెనుకబడింది.
ఢిల్లీ, మే 17: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జైస్వాల్ త్వరగానే ఔటైనా, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం చెలరేగిపోయాడు. భారీ షాట్లతో రెచ్చిపోయాడు. జురెల్ తో కలిసి కేవలం 34 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
వైభవ్ 21 బంతుల్లోనే 46 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. వైభవ్ వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రి యాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.ఈ సీజన్ లో పెద్ద గా ఆడని పరాగ్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. జురెల్ , పరాగ్ మూడో వికెట్ కు 72 పరుగులు జోడించారు.
14 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 160/3.. దీంతో ఖచ్చితంగా 230 ప్లస్ స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ పేసర్ మిఛెల్ స్టార్క్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెర్రీరా, రవి సింగ్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు స్కోరు చేసింది. అంటే తన చివరి 6 ఓవర్లలో ఆ జట్టు.. కేవలం 33 పరుగులు మాత్రమే స్కోరు చేసింది.
దీంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, లుంగీ ఎం గిడి 2, మాధవ్ తివారీ 2 వికె ట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపో యింది. ఓపెనర్లు కెఎల్ రా హుల్, అభిషేక్ పోరెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరి జోరుతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న పోరెల్ , రాహుల్ తొలి వికెట్ కు 61 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు.
అభిషేక్ పోరె ల్ 31 బంతుల్లో 51 ( 7 ఫోర్లు, 1 సిక్సర్ ), కెఎల్ రాహుల్ 42 బంతుల్లో 56 పరుగు లు చేయగా..అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. స్టబ్స్ (4) , మిల్లర్ (9) నిరాశపరిచినా అశుతోష్ శర్మ చివర్లో మెరుపులు మెరిపిం చాడు. దీంతో ఢిల్లీ మరో నాలు గు బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. అక్షర్ పటేల్ 34 నాటౌట్, అశుతోశ్ శర్మ 18 నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయిం ట్లు సాధించగా.. రాజస్థాన్ కూడా 12 పా యింట్లతోనే నిలిచింది. ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశముంటుంది.
స్కోరు బోర్డు
రాజస్థాన్ ఇన్నింగ్స్ : 193/8 ( జురెల్ 53, రియాన్ పరాగ్ 51, వైభవ్ సూర్యవంశీ 46 ; స్టార్క్ 4/40, ఎంగిడి 2/24 )
ఢిల్లీ ఇన్నింగ్స్ : 197/5 ( కెఎల్ రాహుల్ 56, పోరెల్ 51, అక్షర్ పటేల్ 34 నాటౌట్ ; ఆర్చర్ 2/35, బ్రిజేశ్ శర్మ 2/44 )






