27 March, 2026 | 3:13 AM

కుళ్లిన మాంసం.. మరిగిన నూనె

27-03-2026 12:32 AM

హోటళ్ళ వంట గదులు చూస్తే జడుసుకోవాల్సిందే..

మామూళ్ళ మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు

జిల్లాలో కానరాని అధికారులు

మక్కరాజ్పేట వై జంక్షన్ దాబాలో కుళ్ళిన మాసం లభ్యం 

చేగుంట మార్చి 26 : జిల్లాలోని హోటళ్ళు, దాబాల్లో ఆహార నాణ్యత గాలికొదిలేశారు..నిర్వాహకులు కాసుల కక్కుర్తితో ప్రజ ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. పర్యవేక్షించాల్సిన ఆహార భద్రత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. హోటళ్ళలో వాడుతున్న నూనెలు, మాంసం నాణ్యతను పరీక్షించాల్సిన వారు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో అడుగు పెట్టగానే నో రూరించే చికెన్ బిర్యానీతో పాటు పలు ర కాల ఐటమ్స్ ఆహ్వానిస్తుంటాయి.

అయితే అది కేవలం గుమగుమలాడే వాసన తప్పితే ఆహార పదార్థాల్లో అంతా కల్తీమయమే. ఎన్నో రోజుల నుంచి ఫ్రిజ్ లో నిలువ ఉంచిన చికెన్, కాలం చెల్లిన కలర్స్ వాడుతున్నారు. గురువారం రోజు చేగుంట మండ లంలోని మక్కారాజ్ పేట్ గ్రామంలో గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో చేసిన దాడు ల్లో వై జంక్షన్ దాబాలో కుళ్లిపోయిన చికెన్, మేక తలకాయ, బోటి, కల్తీ ఆహార బాగోతం బయటపడింది.

కుళ్లిపోయిన మాంసం విక్రయం...

చేగుంట మండలం మక్కరాజ్పేట్ గ్రా మంలో ఉన్న వై జంక్షన్ ఫ్యామిలీ డాబా వద్ద కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు కలిసి హోట ల్లో సోదాలు నిర్వహించగా అక్కడ నిల్వ ఉంచిన మాంసం దుర్వాసనతో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ దృ శ్యాన్ని చూసిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలు విక్రయించడం అత్యంత ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థులు సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హోట్ప కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుమా నాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

జాడలేని ఫుడ్ సేఫ్టీ అధికారులు...

జిల్లాలో ఆహార భద్రతపై పర్యవేక్షణ కొరవడడంతో రెస్టారెంట్లు, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ ఆహారం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షించా ల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు జిల్లాలో ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఫిర్యాదులు అందినా పట్టించుకోక పోవడం గమనార్హం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సదరు హోటళ్ళ యజమానులతో కుమ్మక్కై కేవలం నోటీసులతో సరిపెడుతున్నారు.

నిత్యం తనిఖీలు చేపట్టాల్సి ఉండగా నెలనెలా మామూళ్ళు తీసుకుంటూ పర్యవేక్షణ గాలికొదిలేశారు. దీంతో జిల్లాలో విపరీతంగా కల్తీతో పాటు కుళ్ళిన తినుబండారాలు యధేచ్ఛగా అమ్ముతున్నారు. వీటిని తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురికావాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పలు హోటళ్ళపై తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.