10 June, 2026 | 6:25 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుల్లో రోస్టర్ విధానం పాటించాలి

10-06-2026 05:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను మంజూరు చేసి నూతనంగా నియమించే ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుల నియామకాల్లో రోస్టర్ విధానం పాటించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న చిన్న పోస్టులకు ఆయాలకు రోస్టర్ విధానం పాటించే ప్రభుత్వం మరి డిఎడ్ టిటిసి అర్హతతో ఉద్యోగం చేసే పోస్టులకు రోస్టర్ విధానం ఎందుకు పాటించడం లేదని తద్వారా గ్రామస్థాయిలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

వెంటనే ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు రోస్టర్ విధానంలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులను డీఎస్సీ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తున్నందున రోస్టర్ విధానం ప్రకటించి ఆయా సామాజిక వర్గాల వారిగా రిజర్వుడు స్థానాలను రిజర్వుడ్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేయడమైనది తద్వారా ఆయా సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగేటట్టు ఉంటుందని ఈ విషయంలో ప్రభుత్వం విద్యాశాఖ పునరాలోచన చేయాలని డిమాండ్ చేయడమైనది కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు