10 June, 2026 | 7:11 PM

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి

10-06-2026 06:06 PM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గాంధేయవాదిగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేష న్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడికి నిదర్శనమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అధికార అహంకారంతో ప్రజా స్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష స్వరాలను అణిచివేసే ప్రయత్నాలు జరు గుతున్నాయని ఆరోపించారు.

రాజ్యాం గబద్ధ సంస్థలను బలహీనపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా నాయ కురాలు రాజ్యసభకు పోటీ చేసే అవకా శాన్ని అడ్డుకోవడం ద్వారా మహిళా సాధి కారతపై బీజేపీ ప్రభుత్వ వైఖరి బహిర్గ తమైందన్నారు. ఒకవైపు మహిళా రిజర్వే షన్ బిల్లును ప్రచారం చేసుకుంటూ, మరో వైపు మహిళా నాయకుల రాజకీయ అవ కాశాలను హరించడం విచారకరమని పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణకు ముందు వివరణ ఇచ్చే అవకాశం కల్పిం చకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అను మానాలు కలిగిస్తోందన్నారు.

ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు కూడా అను మతి నిరాకరించడం ప్రజాస్వామ్య వ్యవ స్థలకు అవమానకరమని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి ప్రజలకే ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాను న్న రోజుల్లో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారని, ప్రజల తీర్పే ఇలాంటి నియంతృత్వ ధోరణులకు ముగింపు పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.