శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని ప్రాజెక్టును బుధవారం నలుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం సందర్శించింది. శాంతిఖని బొగ్గు గనిలో తరగని అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. ఈ నిక్షేపాలను ఆధునిక పద్ధతిలో వెలికితీతకు సింగరేణి సంస్థ నిర్ణయ తీసుకుంది.
ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని సాధించే అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం కోసం ఆస్ట్రేలియా బృందం వచ్చినట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత పై గనిలోని పని స్థలాలను ప్రతినిధి బృందం స్వయంగా పరిశీలించింది. గనిలో సాలార్జింగ్ సీమ్, సౌత్, నార్త్, ఈస్ట్ బొగ్గు నిక్షేపాలున్న స్థలాలను ప్రతినిధిబృందం పరిశీలించింది.
గనిని సందర్శించిన ప్రతినిధి బృందంలో ఆస్ట్రేలియా కు చెందిన బ్రిజ్బెన్ నగరం లో ని టాలి యామన్ అనే కన్సల్ టెన్సీ కంపెనీ (మైనింగ్ ఎక్యూప్ మెంట్ సర్వీసెస్ కంపెనీ ) డైరెక్టర్ గ్రాంట్ పోల్డ్, జీఎం జెరార్డ్ మిల్లర్, అహ్మదాబాద్ మైనింగ్ కన్సల్ టెన్సీ నందన్, దన్బాద్ కుంచెందిన మైనింగ్ ఫ్రొఫెసర్ సిన్హాలు ఉన్నారు. అంతరం ఈ ప్రతినిధి బృందం మందమర్రి జీఎం రాధాకృష్ణ ,ఇతర అధికారులతో క్షుణ్ణంగా చర్చించి తగిన నివేదికను రూపొందించనున్నారు.
ఈ నివేదికను హైదరాబాదులో సింగరేణి భవన్ లో సీ అండ్ ఎం డీ తో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం నివేదికను సీ అండ్ ఎండీకి అందజేస్తారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి జిఎం రాధాకృష్ణ, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని ప్రాజెక్టు అధికారి మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్, కొత్త ప్రాజెక్ట్ అధికారి ఎస్ సంతోష్ కుమార్, శాంతిఖని గ్రూప్ ఇంజనీర్ బసవరాజ్ లు స్వాగతం పలికారు. గని మేనేజర్ ఆఫీసులో శాంతిఖని స్థితిగతులను అధికారులు ప్రతినిధి బృందానికి విపులంగా వివరించారు.






