రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి
10-06-2026 05:49 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలం రైతులు వానకాలం ఎరువుల కొనుగోలుకు సంబంధించి యూరియా యాప్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని రైతులు త్వరతగిన అప్డేట్ చేసుకొని యూరియా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోగలరు. వానకాలం పంటలకు సంబంధించి ఎరువుల వినియోగం మొదలైందని ఏవో సాయికిరణ్ తెలిపారు. కాబట్టి రైతులు ముందస్తుగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని సులువుగా యూరియా పొందగలరు. మొబైల్ నంబర్ అప్డేట్ కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి అప్డేట్ చేసుకోగలరు.






