ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆయా పాఠశాలలకు ప్రభుత్వం తరఫున నుండి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ లు, నోట్బుక్లను సరఫరా చేసినట్లు మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒకటి తరగతి నుండి పదవ తరగతి వరకు ఆయా పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులకు టెక్స్ట్ బుక్కులు, నోటు బుక్కులు అందజేసినట్లు మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ... గ్రామాలలోని పిల్లలు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని, ప్రైవేటు పాఠశాలలోనీకి వెళ్ళకూడదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను ఏర్పాట్లను సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిఆర్పిలు ఉన్నారు.






