23 May, 2026 | 3:20 AM

అభివృద్ధికి సహకరించాలి

23-05-2026 01:00 AM
  1. అసత్య కథనాలను మానుకోవాలి
  2. ప్రభుత్వ సలహాదారు వీహెచ్

ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి): టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌పై ఓ మీడియాలో వచ్చిన కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే దుష్ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అంబర్‌పేటలోని వీహెచ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

గాంధీభవన్‌లోని దృశ్యాలను చూపిం చడంలో ఆ మీడియా ఆంతర్యం ఏమిటని ప్ర శ్నించారు. అసత్య ప్రచారం వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రచారం చేయాల్సింది పోయి, మహేష్ కుమార్ ఎదుగుదలను అడ్డుకునే విధంగా అసత్య ప్రచారం ఉందన్నారు. ఈ కథనంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ తమ పార్టీ నాయకులపై కానీ అసత్యపు ప్రసారా లు చేస్తే సహించేది లేదని  హనుమంతరావు హెచ్చరించారు.