16 April, 2026 | 4:52 AM

రహదారి భద్రత.. అందరి బాధ్యత..

16-04-2026 01:35 AM

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ lస్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపి ర్యాలీలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి):  దేశంలో సహజ మరణాల కంటే, రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువగా ఉండటం అత్యంత ఆవేదన కలిగిం చే అంశమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణాలకు రక్షణ కవచమని ఆయన పేర్కొన్నారు.

హించిన అరైవ్ అలైవ్, రహదారి భద్రత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజు మర్మాట్,  ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టేడియం మైదానంలో పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి ‘హెల్మెట్ - సేవ్ లైవ్స్ ఆకారంలో భారీ మానవహారాన్ని నిర్వహించారు. అనంతరం యువతకు లెర్నిం గ్ లైసెన్స్లను, డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలను మంత్రి పంపిణీ చేశారు. అదేవిధంగా స్టేడి యం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో  మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. 

అదేవిధంగా అంబెడ్కర్ చౌక్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వాహనదారులకు హెల్మెట్లను పంపిణీచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని మంత్రి వివరించా రు. ప్రజల్లో అవగాహన కల్పించడం, రహదారుల నిర్మాణం, లోపాల సవరణ, నిబంధనల కఠినంగా అమలు చేయడం, ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేప ట్టడం జరుగుతుందని తెలిపారు.

ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయాణం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు