9 April, 2026 | 4:17 AM

నాగోల్‌ల్లో రోడ్డు ప్రమాదం

09-04-2026 12:08 AM

ఆటో ఢీకొని యువకుడు మృతి, డ్రైవర్ పరారీ

నాగోల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఇంటికి చేరుకునే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో యువకుడు మృ తి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి గ్రా మానికి చెందిన పోతురాజు ప్రవీణ్ (24) నా గోల్లోని పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తట్టి అన్నారం ప్రాం తంలోని రవి నారాయణరెడ్డి కాలనీలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని సుమా రు 10:45 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడి అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోగా ఆటో డ్రైవర్ అక్క డి నుంచి పరారైనట్లు సమాచారం. మృతుడి అన్న పోతురాజు నవీన్ ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసా గుతోందని తెలిపారు.