calender_icon.png 10 February, 2026 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి

10-02-2026 12:00:00 AM

హైపాటిటైస్ బీ టీకా ప్రారంభమించిన డీఎంఅండ్‌హెచ్‌ఓ 

అశ్వారావుపేట, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): ఆర్‌ఎంపి లు, పిఎంపిలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. సోమవారం  ఆయన అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు హెపటైటిస్-బి జీరో డోస్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఏ ఎన్‌సీ రిజిస్టర్ను పరిశీలించి, గర్భిణీ స్త్రీలకు సమతుల ఆహారం అవసరం, సిపిఆర్ కార్యకలాపాలు, జాతీయ డివార్మింగ్ డే, ఐరన్ శోషణ ప్రాముఖ్యత, అయోడైజ్డ్ ఉప్పు వినియోగం, అలాగే సామ్ అండ్ మామ్ పిల్లలను గుర్తించి ఫాలోఅప్ చేయాల్సిన అవసరంపై చర్చించారు. మండలంలోని ఆర్‌ఎంపి, పిఎంపిలతో  సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.

అనైతిక వైద్య విధానాలు పాటించవద్దు అన్నారు. అవసరం లేకుండా అధిక స్థాయి యాంటీబయాటిక్స్ వాడకూడదు అని తెలిపారు. ఆరోగ్య శాఖతో కలిసి ఐ ఈ సి కార్యక్రమాల్లో సమన్వయం కలిగి ఉండాలన్నారు. తమ కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించి, రోగులను సరైన సమాచారం తో తగిన ఆసుపత్రులకు రిఫర్ చేయాలనీ సూచించారు. ఆర్‌ఎంపి లు అర్హత కలిగిన చికిత్సలనే అందించాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించారు. అనారోగ్యకరమైన వైద్య విధానాలపై ఎన్ హెచ్ ఆర్ సి కూడా గంభీరంగా ఉందని తెలియజేశారు. 

అర్హత కలిగిన వైద్యులకే రోగులను పంపించాలన్నారు. చట్టబద్ధ పరిమితులలో సురక్షిత వైద్య సేవలు అందించాలనీ కోరారు. క్యాన్సర్, క్షయవ్యాధి, మధుమేహం, రక్తపోటు మరియు కుష్ఠు వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నీ కూడా సందర్శించారు. లేబర్ రూమ్, ఫార్మసీ రూమ్, వార్డ్ మరియు ఇంజెక్షన్ రూమ్లను పరిశీలించారు. అవసరమైన మందుల నిల్వలు తగినంతగా ఉంచాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా మరియు పచ్చదనంతో ఉంచాలని ఆదేశించారు. రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను సేకరించారు.