26 April, 2026 | 6:59 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

10-02-2026 12:00 AM

మీడియా సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9, (విజయక్రాంతి): ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో  కొత్తగూడెం డిఎస్పి  కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33 డివిజన్లలో రూ 34 వేల విలువగల 40 లీటర్ల మద్యాన్ని, రూ 2. 70 లక్షల విలువ గల 5.5 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.  మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ను ఉల్లంఘించినందుకు గాను మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని,110 కేసుల్లో 258 మంది సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయడం జరిగిందని వివరిం చారు.

33 డివిజన్లలోని 41 పోలింగ్ స్థానాలలో 110 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో 65 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా,45 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.ఓటర్లను ప్రలోవ్ పెట్టే విధంగా ఎవరైనా మద్యం, నగదు ఇతరత్రా వస్తువులను సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు.ఎవరైనా శాంతిభద్రతలకు విగాథం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు.