calender_icon.png 12 February, 2026 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై మేయర్‌గా రీతూ తావ్డే

12-02-2026 01:48:14 AM

పాతికేళ్ల తర్వాత శివసేనకు చేజారిన మేయర్ పీఠం

ముంబై, ఫిబ్రవరి 11: ముంబయి మేయర్ ఎన్నికపై మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఫిబ్రవరి 11న జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికార కూటమి తన అభ్యర్థులను ఖరారు చేసింది. మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే, డిప్యూటీ మేయర్‌గా  శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘడీ పేరును ప్రతిపాదించింది.

స్థానికంగా బీజేపీ సీనియర్ నేత అయిన రీతూ ఘట్కోపర్ వెస్ట్ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. వార్డు స్థాయిలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ, శివసేన నేతలు అమిత్ సతమ్ తెలిపారు.