నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం
27-06-2026 07:19 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మద్నూర్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరిన నిరంతరం శ్రమిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ ప్రతి ఇంటి అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం శ్రమిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






