27 June, 2026 | 8:33 PM

సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి

27-06-2026 07:12 PM

బోథ్,(విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సోనాల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. జూనియర్ కళాశాల లేకపోవడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని మండలంలో ఒకే ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండడంతో ఆశించిన స్థాయిలో విద్యార్థులు చదవడం లేదని వారు మంత్రి వివరించారు.

కాగా గతంలో మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుల అరుణ్ కుమార్ సైతం మంత్రికి వివరించడం జరిగింది వినతిపత్రం సమర్పించిన వారిలో డిసిసి కార్యదర్శి ఎల్ పోశెట్టి చౌహన్ హరి సింగ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వినోద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్ చింతల బోరి సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర సోమన్న జుంగాల భోజన్న  సుదర్శన్ భీమ్రావు పాటిల్ తదితరులు ఉన్నారు